ప్రకృతి వైద్య సేవలు అభినందనీయం

ABN , First Publish Date - 2020-12-02T05:00:44+05:30 IST

ప్రకృతి వైద్య సేవలు అభినందనీయం

ప్రకృతి వైద్య సేవలు అభినందనీయం
అతిథులకు పుస్తకాలను అందజేస్తున్న నిర్వాహకులు

ఇబ్రహీంపట్నం రూరల్‌ : వినోభా గ్రామంలోని రామచంద్ర ప్రకృతి ఆశ్రమంలో గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్‌ప్రతిష్ఠాన్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ కేవై రాంచందర్‌రావు, డాక్టర్‌ ఎంజీ పద్మ ఉచిత ప్రకృతి వైద్యసేవలందించడం అభినందనీయమని జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ అన్నారు. రామచంద్ర ప్రకృతి ఆశ్రమంలో 5వ నెల ఉచిత వైద్య శిబిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. సుస్థిర అభివృద్ధి భారతీయ విజ్ణానం ఆచరణలో భాగంగా ఇన్ని రోజులకు ప్రకృతికి దగ్గరగా ఉండే ఆరోగ్య నియమాలు చెబుతూ అందరికీ ఆత్మ విశ్వాసంతో పాటు మానసిక స్పందనలో మార్పు తెస్తూ సంపూర్ణ ఆరోగ్యానికి కృషి చేస్తున్న వైద్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. గాంధీ సంస్థల చైర్మన్‌ గున్న రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య సేవలను అందరూ స్వద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో నయం కాని రోగాలను ఇక్కడ నయం చేయడానికి కృషి చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్‌ సభ్యులు యనాల ప్రభాకర్‌రెడ్డి, మల్లేకేడి రామాంజనేయులు, కే సుభా్‌షచంద్ర, వాణి, గుండాల గోవర్ధన్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T05:00:44+05:30 IST