Abn logo
May 23 2020 @ 17:31PM

ప్రకాశం జిల్లాలో మహిళపై వైసీపీ నేత దాడి

ప్రకాశం: ఏపీలో అధికార పార్టీ నేతల దాడులకు అంతులేకుండా పోతోంది. జిల్లాలోని పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లిలో గురవమ్మ అనే మహిళపై స్థానిక వైసీపీ నేత వెంకటేశ్వర రెడ్డి దాడి చేశాడు. గురవమ్మ కల్లాపి చల్లుతుండగా.. ఆమెపై పేడ నీళ్లు చల్లాడు. అనంతరం ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. ఈ దృశ్యాలను స్థానికులు తమ మొబైల్ ఫోన్‌లలో చిత్రీకరించగా తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఓ స్థలం విషయంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. గత కొంతకాలంగా అది కొనసాగుతోంది. తరుచూ అసభ్యంగా ప్రవర్తిస్తూ దాడికి దిగుతుండడంతో గురవమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తాజా దాడి మరింత సంచలనంగా మారింది. 

Advertisement
Advertisement
Advertisement