ప్రకాశం ఇంజనీరింగ్‌ కాలేజి కరస్పాండెంట్‌ రామయ్య, కళాశాల విద్యార్థులను అభినందిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ABN , First Publish Date - 2022-01-20T04:43:59+05:30 IST

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రకాశం ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులను ప్రశంసించారు. 2021 సంవత్సరానికి సోషల్‌ ఇన్నోవేషన్‌ చాంపియన్స్‌గా ప్రకాశం ఇంజనీరింగ్‌ కాలేజి విద్యార్థులు నిలిచిన సందర్భంగా వెంకయ్యనాయుడుని విద్యార్థులతోపాటు కలుసుకున్నట్లు కాలేజి కరస్పాండెంట్‌ రామయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని స్వర్ణభారత్‌ ట్రస్టులో నిర్వహించిన జాతీయస్థాయి ప్రాజెక్టు పోటీలలో మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌, కేఎల్‌ యూనివర్సిటీ, భారతి యూనివర్సిటీ లాంటి విద్యాసంస్థలతో పోటీపడి తమ విద్యార్థులు చాంపియన్స్‌గా నిలిచారని వివరించటంతో వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు.

ప్రకాశం ఇంజనీరింగ్‌ కాలేజి కరస్పాండెంట్‌ రామయ్య, కళాశాల విద్యార్థులను అభినందిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

 ‘ప్రకాశం’ విద్యార్థులకు వెంకయ్యనాయుడు ప్రశంసలు

   కందుకూరు, జనవరి 19: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రకాశం ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులను ప్రశంసించారు. 2021 సంవత్సరానికి సోషల్‌ ఇన్నోవేషన్‌ చాంపియన్స్‌గా ప్రకాశం ఇంజనీరింగ్‌ కాలేజి విద్యార్థులు నిలిచిన సందర్భంగా వెంకయ్యనాయుడుని విద్యార్థులతోపాటు కలుసుకున్నట్లు కాలేజి కరస్పాండెంట్‌ రామయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని స్వర్ణభారత్‌ ట్రస్టులో నిర్వహించిన జాతీయస్థాయి ప్రాజెక్టు పోటీలలో మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌, కేఎల్‌ యూనివర్సిటీ, భారతి యూనివర్సిటీ లాంటి విద్యాసంస్థలతో పోటీపడి తమ విద్యార్థులు చాంపియన్స్‌గా నిలిచారని వివరించటంతో వెంకయ్యనాయుడు ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు. రైతులు ఆకుకూరలు, కూరగాయలను 24 గంటల పాటు తాజాగా ఉంచుకునేందుకు తమ విద్యార్థులు ఫ్రిజ్‌కి ప్రత్యామ్నాయంగా రూపొందించిన మినీ కోల్డ్‌స్టోరేజి ప్రాజెక్టు తాము చాంపియన్స్‌గా నిలిచేందుకు దోహదపడిందని వివరించటంతో గ్రామీణ ప్రాంత కళాశాల, అందులోను గ్రామీణ నేపఽథ్యంనుంచి వచ్చిన విద్యార్థులు ఇలాంటి రూపకల్పన చేయటం ప్రశంసనీయమని వెంకయ్యనాయుడు అభినందించినట్లు తెలిపారు. మినీ కోల్డ్‌స్టోరేజి రూపకల్పనకు విద్యార్థులను ప్రోత్సహించిన ఎస్‌ఎం మీరావలిని, థర్డ్‌ ఇయర్‌ ట్రిఫుల్‌ఈ విద్యార్థినులు మౌనీషా, సాయిప్రసన్న, దీక్ష, నీలిమలను ఆయన అభినందించటంతోపాటు వారిని ప్రోత్సహిస్తున్న కాలేజి యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారని రామయ్య తె లిపారు. భవిష్యత్‌లోనూ రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజల జీవనప్రమాణాలను పెంచేందుకు దోహదపడే ప్రాజెక్టుల రూపకల్పనకు కృషి చేయాలని వెంకయ్యనాయుడు సూచించారని రామయ్య వివరించారు.


Updated Date - 2022-01-20T04:43:59+05:30 IST