సాగర్‌కు ఇన్‌ఫ్లో.. 3,33,603 క్యూసెక్కులు

ABN , First Publish Date - 2020-10-23T10:14:32+05:30 IST

శ్రీశైలానికి ఎగువ ప్రాజెక్ట్‌ అయిన జూరాల నుంచి శ్రీశైలానికి 2,64,240 క్యూసెక్కులు, రోజా నుంచి 80,513 క్యూసెక్కులు, హంద్రీ..

సాగర్‌కు ఇన్‌ఫ్లో.. 3,33,603 క్యూసెక్కులు

విజయపురిసౌత్‌, అక్టోబరు 22: శ్రీశైలానికి ఎగువ ప్రాజెక్ట్‌ అయిన జూరాల నుంచి శ్రీశైలానికి 2,64,240 క్యూసెక్కులు, రోజా నుంచి 80,513 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 117 క్యూసెక్కులు మొత్తంగా 3,44,870 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు 3,33,603 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వాటర్‌గా వచ్చి చేరుతోంది. సాగర్‌లో 18 క్రస్ట్‌ గేట్ల ద్వారా 2,95,572 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ నీటిమట్టం గురువారం నాటికి 589.50 అడుగులు ఉంది. ఇది 310.55 టీఎంసీలకు సమానం. కుడి కాలువ ద్వారా 7,778, ప్రధాన జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 25,172, ఎడమ కాలువ ద్వారా 4481, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 600 మొత్తం ఔట్‌ఫ్లో 3,33,603 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నీటిమట్టం 884.80 అడుగులుంది. ఇది 214.36 టీఎంసీలకు సమానం. 


ప్రకాశం బ్యారేజి నిలకడగా వరద ఉధృతి

తాడేపల్లి టౌన్‌: ఎగువ జలాశయాల నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో ప్రకాశం బ్యారేజి వద్ద వరద ఉధృతి నిలకడగా ఉంది. గురువారం సాయంత్రానికి ఎగువ నుంచి 4లక్షల 14వేలు క్యూసెక్కుల వరద రిజర్వాయర్‌ వద్ద ఇన్‌ఫ్లోగా వచ్చి చేరిందని ఇరిగేషన్‌ జేఈ దినేష్‌ తెలిపారు. బ్యారేజి నుంచి దిగువకు 4లక్షల 12వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 2,500 క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజి రిజర్వాయర్‌ వద్ద 12.3 అడుగుల నీటి మట్టం కొనసాగిస్తూ మొత్తం 70 గేట్లను పూర్తిగా ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నట్లు జేఈ తెలిపారు. 


పశ్చిమడెల్టాకు 1516 క్యూసెక్కులనీరు

దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజి నుంచి కృష్ణా పశ్చిమడెల్టాకు 1516 క్యూసెక్కులను గురువారం విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద నీటిమట్టం 12.4 అడుగులు ఉండగా దిగువకు 4,17,270 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. దుగ్గిరాల సబ్‌ డివిజన్‌ నుంచి రేపల్లె కాల్వకు 130, తూర్పుకాల్వకు 133, పశ్చిమకాల్వకు 50, నిజాంపట్నంకాల్వకు 100, కొమ్మమూరుకాల్వకు 666 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. 

Updated Date - 2020-10-23T10:14:32+05:30 IST