Abn logo
Nov 28 2020 @ 20:45PM

నాగబాబు ట్వీట్‌కు ప్రకాష్‌ రాజ్‌ స్ట్రాంగ్‌ రిప్లయ్‌

మెగా బ్రదర్‌ నాగబాబు, విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ముందుగా ప్రకాష్‌ రాజ్‌ ఓ ఇంటర్వ్యూలో జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ను ఊసరవెల్లి అని అంటూ.. పార్టీ ఉండి కూడా పోటీ చేయకుండా, తానొక నాయకుడనే విషయం మరిచిపోయాడనే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఫైర్‌ అయిన నాగబాబు.. ప్రకాష్‌ రాజ్‌కు కౌంటర్లు సంధిస్తూ.. ఆయన ప్రవర్తనా తీరును కూడా ఎండగట్టారు. దీంతో ఒక్కసారిగా వారిద్దరి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా నాగబాబు చేసిన కామెంట్స్‌కి స్ట్రాంగ్‌ రిప్లయ్‌ ఇస్తూ.. ప్రకాష్‌ రాజ్‌ ట్వీట్‌ చేశారు.


''గౌరవనీయులైన నాగబాబుగారికి, మీ తమ్ముడు మీద ఉన్న ప్రేమ నాకు అర్థం అయ్యింది. నాకు దేశం మీద ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు కానీ మీ భాష రాదు.." అని చేతులు జోడించి నమస్కరిస్తున్న ఈమోజీలను పోస్ట్ చేశారు.


Advertisement
Advertisement
Advertisement