కష్టంలో ఉన్నవారెవరైనా కనిపిస్తే చాలు కరిగిపోయే హృదయం అందరికీ ఉండకపోవచ్చు. కానీ చిరంజీవి, ప్రకాశ్ రాజ్, సోనూసూద్ వంటి వారి హృదయాలు మాత్రం ఆ కష్టంలో ఉన్నవారిని ఆదుకునేందుకు పరితపిస్తాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తాజాగా ప్రకాశ్ రాజ్ ఓ కుటుంబానికి జేసీబీని అందించి.. ఆ కుటుంబ కష్టాన్ని తీర్చేశారు. మైసూర్‌లోని శ్రీరంగపట్నకు చెందిన ఓ ఫ్యామిలీకి ఉపాధి కల్పించేందుకు ప్రకాశ్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ఓ జేసీబీని ఆయన అందించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ‘‘ఒక జీవితంలో వెలుగును నింపేందుకు.. మనం సంపాదించింది తిరిగి ఇస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది’’ అని అన్నారు.