Chitrajyothy Logo
Advertisement

MAA : అన్నయ్యా.. అంటూ ప్రకాష్ రాజ్ పలకరింపు.. విష్ణుతో కరచాలనం

twitter-iconwatsapp-iconfb-icon
MAA : అన్నయ్యా.. అంటూ ప్రకాష్ రాజ్ పలకరింపు.. విష్ణుతో కరచాలనం

హైదరాబాద్ సిటీ : ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ‘మా’ సభ్యులంతా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కూడా తన ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా పోటీలో ఉన్న ప్రకాష్ రాజ్ కూడా వచ్చి.. మోహన్ బాబును ‘నమస్తే అన్నయ్యా..’ ఆప్యాయంగా అంటూ పలకరించారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న విష్ణును దగ్గరికి పిలిచి ప్రకాష్‌తో కరచాలనం చేయించారు. అనంతరం ఇద్దరూ నవ్వుతూ ఆలింగనం చేసుకున్నారు. పోలింగ్ సరళిపై ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి ఓటింగ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనున్న ఈ పోలింగ్ కొనసాగనుండగా.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది. 8 గంటల తర్వాత మా కింగ్ ఎవరో తేలిపోనుంది.

MAA : అన్నయ్యా.. అంటూ ప్రకాష్ రాజ్ పలకరింపు.. విష్ణుతో కరచాలనం


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement