Advertisement
Advertisement
Abn logo
Advertisement

AP: కొండమూరులో గ్రామస్తులపై వైసీపీ నేత బెదిరింపులు

ఒంగోలు: ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం కొండమూరులో గ్రామస్తులపై వైసీపీ నేత బెదిరింపులు పాల్పడ్డాడు. వైసీపీ నేతకు చెందిన రైస్ మిల్లు నుంచి వెలువడుతున్న దుమ్ము, కాలుష్యం వల్ల గ్రామస్తులు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశువులు, గొర్రెలు  మృత్యువాత పడుతున్నారు. రైస్ మిల్లులో పెద్దఎత్తున రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా... కాలుష్యం రాకుండా చూడాలని కోరుతున్న గ్రామస్తులపై వైసీపీ నేత బెదిరింపులకు పాల్పడ్డాడు.  మంత్రి బాలినేని తమ బంధువేనని, తమను ఏమి చేయలేరని వైసీపీ నేత హల్‌చల్ చేశాడు. వైసీపీ నేత తీరు, రైస్‌ మిల్‌ కాలుష్యాన్ని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 

Advertisement
Advertisement