Advertisement
Advertisement
Abn logo
Advertisement

AP: బైక్‌ను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం...దంపతులు మృతి

ఒంగోలు: ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మృతులు మేదరమెట్లలో బట్టల షాపును నిర్వహించే వెంకటేశ్వర్లు, అనంతలక్ష్మి దంపతులుగా గుర్తించారు. షాపు పని పూర్తి చేసుకుని బైక్‌పై తిరిగి ఒంగోలు వెళ్తుండగా గ్రోత్ సెంటర్ వద్ద ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
Advertisement