Abn logo
May 15 2021 @ 13:36PM

చీరాలలో వృద్ధురాలు అనుమానాస్పద మృతి

ఒంగోలు: ప్రకాశం జిల్లా చీరాల బందావారివీధిలోని ఓ ఇంటి బాత్రూంలో వృద్ధురాలు విజయ లక్ష్మమ్మ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మృతదేహం వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా... వృద్ధురాలు మూడు రోజుల క్రితమే చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. గత కొద్ది కాలంగా వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు. వృద్ధురాలి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు.