ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

ABN , First Publish Date - 2020-09-19T15:38:46+05:30 IST

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

ఒంగోలు: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పల్లెలు, పట్టణాలు జలమయమయ్యాయి. వర్షపు నీటితో పశ్చిమ ప్రకాశంలో చెరువులు నిండుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు సగిలేరు, జంపలేరు వాగులు పొంగి పొర్లుతున్నాయి. నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం వద్ద నీటి గుండం ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. 

Updated Date - 2020-09-19T15:38:46+05:30 IST