మార్కాపురం, కందుకూరు నియోజవర్గాల్లో బంద్ నేడు

ABN , First Publish Date - 2022-02-15T16:24:03+05:30 IST

ప్రకాశం: జిల్లాలో కొత్త జిల్లాల అంశం చిచ్చు రేపుతోంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాకు..

మార్కాపురం, కందుకూరు నియోజవర్గాల్లో బంద్ నేడు

ప్రకాశం: జిల్లాలో కొత్త జిల్లాల అంశం చిచ్చు రేపుతోంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాకు.. తమకు దూరమంటూ కందుకూరు అద్దంకి నియోజక వర్గం ప్రజలు ఆందోళనబాట పట్టారు. మరోవైపు మార్కాపురం డివిజన్ ప్రజలు తమకు కొత్త జిల్లా కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ మంగళవారం మార్కాపురం, కందుకూరు నియోజకవర్గాల్లో బంద్‌కు పిలుపిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్చంధంగా బంద్‌కు మద్దతు ప్రకటించారు.


కందుకూరు నుంచి నెల్లూరు వెళ్లాలంటే 120 కి.మీ. ప్రయాణం  చేయాలి. ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉన్న ఒంగోలు కందుకూరుకు 50 కి.మీ. దూరంలో ఉంది. దీంతో నెల్లూరులో కందుకూరు నియోజకవర్గాన్ని కలపడాన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.


ప్రకాశం జిల్లాకు పశ్చిమ ప్రాంతంగా ఉన్న మార్కాపురం డివిజన్‌ను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని గత కొన్నేళ్లుగా అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ కొత్త జిల్లాల ఏర్పాటులో  జగన్ ప్రభుత్వం మార్కాపురం ప్రస్తావన లేకుండా చేసింది. ప్రస్తుతం మార్కాపురం నుంచి ఒంగోలు రావాలంటే వంద కి.మీ., గిద్దలూరు నుంచి 150 కి.మీ., ఎర్రగొండపాలెం నుంచి 140 కి.మీ. ప్రయాణం చేయాల్సి ఉంది. దీంతో మార్కాపురానికి దగ్గరగా ఉన్న గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, దర్శి నియోజక వర్గాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ఆందోళనలు చేస్తున్నారు.

Updated Date - 2022-02-15T16:24:03+05:30 IST