ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని పలు పాఠశాలల్లో కరోనా వైరస్ కలకలం రేపింది. బల్లికురవ మండలం కూకట్లపల్లి, కొప్పెరపాడు, కొత్తూరు, అరుణగిరి తాండాల్లోని నాలుగు పాఠశాలల్లో పాఠశాల సిబ్బంది కరోనా టెస్టులు చేశారు. ఆరుగురు విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు, మరో ఇద్దరు నాన్ టీచింగ్ స్టాఫ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా పాజిటివ్‌గా తెలినవారిని ఐసోలేషన్‌కి తరలించారు.