మళ్లీ అన్న NTR రోజులు గుర్తుకొచ్చాయి..

ABN , First Publish Date - 2022-05-29T16:44:26+05:30 IST

మళ్లీ అన్న ఎన్టీఆర్ (NTR) రోజులు గుర్తుకొచ్చాయి. ఎన్టీఆర్ జమానాలో మహానాడు నిర్వహిస్తే...

మళ్లీ అన్న NTR రోజులు గుర్తుకొచ్చాయి..

Ongole: మళ్లీ అన్న ఎన్టీఆర్ (NTR) రోజులు గుర్తుకొచ్చాయి. ఎన్టీఆర్ జమానాలో మహానాడు (Mahanadu) నిర్వహిస్తే ఇసకేస్తే రాలనంతగా జనం వచ్చేవారు. పార్టీ పండుగలో పాల్గొనేందుకు టీడీపీ నేతలు, శ్రేణులేకాదు.. సాధారణ ప్రజలు సయితం ఉత్సాహంతో ఉరకలు వేసేవారు. కిలోమీటర్లమేర రోడ్లపై ఉరుకులు, పరుగులు పెట్టేవారు. ఈసారి ఒంగోలులో జరిగిన మహానాడు ఆ స్థాయిలో జరిగిందని తరలి వచ్చిన జనసందోహాన్ని చూసి చెప్పక తప్పదు.


జగన్ రెడ్డి (Jagan reddy) అధికారంలోకి వచ్చాక మూడేళ్లుగా దాడులు, కేసులతో టీడీపీ (TDP) కార్యకర్తలకు ఊపిరాడలేదు. గట్టిగా ఏడదిన్నర క్రితం వరకు చాలా మంది నేతలు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి. ఆర్ధికంగా, భౌతికంగా అష్టదిగ్బంధనం చేయడంతో విలవిల్లాడారు. ఏ కార్యక్రమం చేపట్టినా.. కరోనా పేరుతో అధికార యంత్రాంగం అడ్డుకోవడం, కేసులు పెట్టడం సర్వసాధారణంగా మారింది. ఆ కష్టాలు, ఇబ్బందుల నుంచి బయటపడాలంటే టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురాక తప్పదని కార్యకర్తలకు అర్ధమైంది. మహానాడు రూపంలో తెలుగు తమ్ముళ్ల ఆకాంక్ష బయటపడింది. మహానాడు బహిరంగ సభకు జనం ఉప్పొంగడం చూశాక.. మూడేళ్లుగా పార్టీ శ్రేణుల్లో నెలకొన్న స్తబ్ధత మటుమయాం అయినట్లు తెలిసిపోతోంది. టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం, కసి ఉరకలేస్తున్నాయి. ఏపీ నలుమూలల నుంచే కాకుండా.. తెలంగాణ నుంచి కూడా జనం భారీగా స్వచ్చంధంగా తరలి రావడం.. ముఖ్యంగా మహిళలు, యువత కదంతొక్కడం.. పార్టీ అధినేత చంద్రబాబు, నేతలను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. లక్షలాదిగా వచ్చే ప్రజలను చూసి.. ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోతుందని ఆనందోత్సాహాలతో చంద్రబాబు కితాబిచ్చారు.

Updated Date - 2022-05-29T16:44:26+05:30 IST