ప్రకాశం: హనుమంతునిపాడు వైసీపీ జడ్పీటీసీ నారాయణపై ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ కక్ష్య పూరిత చర్యలకు దిగారు. నియోజకవర్గంలో తనకు ఎదురు తిరుగుతున్నాడని సొంత పార్టీ జడ్పీటీసీపై ఎమ్మెల్యే బుర్రా కేసులు పెట్టిస్తున్నారు. నారాయణ భూమిలో కొలతలు వేసేందుకు తహశీల్దార్ వెళ్లారు. జడ్పీటీసీ నారాయణ ఎదురు తిరగడంతో తహశీల్దార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే ఒత్తిడితో తనపై కేసులు పెడుతున్నారని జడ్పీటీసీ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి