Abn logo
Aug 2 2021 @ 07:45AM

Prakasam: కౌలు రైతు దంపతుల ఆత్మహత్య

ప్రకాశం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి కౌలు రైతు దంపతులు ఆంజనేయులు(62), ఫణీంద్ర(55) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జె. పంగులూరు మండలంలోని చందలూరు గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబకలహాల వల్ల దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.