ప్రకాశం జిల్లా: ఓటీఎస్ పథకాన్ని వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా, కొంగలవీడు గ్రామ వాలంటీర్ గోళ్ల విష్ణువర్ధన్ రాజీనామా చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక రాజీనామా చేసినట్లు చెప్పారు. ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఓటిఎస్ పేరుతో ప్రభుత్వం ముక్కుపిండి రూ. 10వేలు వసూలు చేయడం తనకు నచ్చలేదన్నారు.
జగనన్న నవరత్నాల పథకాలతో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు తెస్తారని.. ఈ ప్రభుత్వంలో వాలంటీర్‌గా చేరానని విష్ణువర్ధన్ తెలిపారు. ప్రభుత్వ విధానాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. గిద్దలూరు టీడీపీ ఇన్చార్జ్, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో విష్ణువర్ధన్ టీడీపీలో చేరారు.