Abn logo
Aug 15 2020 @ 07:25AM

ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న కరోనా కేసులు

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో 636 కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12,123లకు చేరింది. ఒంగోలులో అత్యధికంగా 123 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి అత్యధికంగా ఆరుగురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 157 మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం 1,80,813 శ్యాంపిళ్లు పంపగా...అందులో 1,67,545 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. ఇంకా 3356 రిపోర్టులు రావాల్సి ఉంది. నిన్న కరోనా నుండి కోలుకుని 43 మంది డిశ్చార్జ్ అయ్యారు.  71 మందిని హోం ఐసోలేషన్‌కు పంపారు. జిల్లాలో ప్రస్తుతం  2085 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement
Advertisement
Advertisement