Vijayawada: ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు

ABN , First Publish Date - 2022-08-10T03:51:05+05:30 IST

ప్రకాశం బ్యారేజీ (Prakasam Barriage)కి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ....

Vijayawada: ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ (Prakasam Barriage)కి భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో బ్యారేజీ నిండుకుండలా మారింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. బ్యారేజీ 70 గేట్లను రెండూ అడుగుల మేర ఎత్తి 90 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కాలువల ద్వారా 7395 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మరోవైపు లంక గ్రామాలు, నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు హెచ్చరిక హెచ్చరించారు. 

Updated Date - 2022-08-10T03:51:05+05:30 IST