Abn logo
Jul 25 2021 @ 00:06AM

ప్రకాశం బ్యారేజి దిగువకు 93వేల క్యూసెక్కులు

బ్యారేజి దిగువన సీతానగరం వద్ద కృష్ణానది వరద దృశ్యం

తాడేపల్లి టౌన్‌, జూలై24: ఎగువనున్న ప్రాజెక్టులు నిండడంతో దిగువకు నీటిని విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజికి వరదనీరు వచ్చి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు, బ్యారేజి ఎగువన వున్న వాగుల నుంచి 95వేల క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతున్నట్టు నీటిపారుదల జేఈ దినేష్‌ తెలిపారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు. బ్యారేజి రిజర్వాయర్‌ వద్ద 12 అడుగుల నీటిమట్టం నమోదవుతుండగా 10గేట్లను ఒక అడుగు, 60 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 93వేల క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదులుతున్నట్టు తెలిపారు.