ప్రకాశం బ్యారేజ్ ఔట్ ఫ్లో 1,33,939 క్యూసెక్కులు

ABN , First Publish Date - 2021-08-06T03:29:15+05:30 IST

ప్రకాశం బ్యారేజ్ నుంచి ఔట్ ఫ్లో 1,33,939 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో తీరప్రాంతాల

ప్రకాశం బ్యారేజ్ ఔట్ ఫ్లో 1,33,939 క్యూసెక్కులు

అమరావతి: ప్రకాశం బ్యారేజ్ నుంచి ఔట్ ఫ్లో 1,33,939 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గురవారం రాత్రి 7.30 గంటల సమయానికి పులిచింతల వద్ద ఔట్ ఫ్లో 5,02,216 క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఔట్ ఫ్లో 1,33,939 క్యూసెక్కులగా ఉంది. ఈ రోజు రాత్రి ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం  ఉంది. అధికారుల అంచనా ప్రకారం 6 లక్షల క్యూసెక్కుల వరకు నీరు విడుదల చేయడం జరుగుతుంది.


ఎప్పటికప్పుడు వరద ఉధృతిని పర్యవేక్షిస్తూ కృష్ణా, గుంటూరు జిల్లాల అధికార యంత్రాంగాన్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడలో 24 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్  బృందాన్ని సహాయక చర్యల కోసం ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. సహాయక చర్యల్లో అధికారులకు  ప్రజలు సహకరించాలని కోరారు. కృష్ణానదీ తీరం వెంబడి అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని, కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని విపత్తు నివారణ శాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దన్నారు. వరద నీటిలో ఈతకు  వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయకూడదన్నారు. పశువులు, గొర్రెలు మేకలు వంటివాటిని నదీలోకి వదలొద్దని  విపత్తు నివారణ శాఖ కమిషనర్ కన్నబాబు, అధికారులు సూచించారు. 


Updated Date - 2021-08-06T03:29:15+05:30 IST