ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం యరజర్లలో కళ్ళకు నల్ల రిబ్బన్లతో గంతలు కట్టుకుని రాజధాని రైతుల వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. పదమూడవ రోజు మహాపాదయాత్రకు విరామం ప్రకటించి రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహా పాదయాత్రకు ప్రజల నుండి వస్తున్న అపూర్వ స్పందనను చూసి ప్రభుత్వం ఓర్వలేకపోతోందని అమరావతి రైతులు తెలిపారు. ప్రజల మద్దతును, మనోబీష్టాన్ని కళ్ళుండి చూడలేక పోతున్న ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా కళ్ళకు గంతలతో రాజధాని రైతులు నిరసన తెలిపారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర కొనసాగించి తీరుతామని రైతులు వెల్లడించారు.