ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-03-01T16:05:56+05:30 IST

ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉడ్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న కావేరీ ట్రావెల్స్ బస్ పార్కింగ్ స్టాండ్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. తొమ్మిది బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. మరో రెండు బస్సులకు మంటలు వ్యాపించాయి. పార్కింగ్ స్టాండ్‌లో దాదాపు 20కి పైగా బస్సులు ఉన్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. మిగిలిన బస్సులను తరలించేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-03-01T16:05:56+05:30 IST