ఒంగోలు: ప్రకాశం జిల్లా పామూరు మండలం మోపాడు రిజర్వాయర్‌కు ఆరు చోట్ల లీకులు ఏర్పడటంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలు చేపట్టారు. గండి పడితే బొట్లగూడూరు, కంబాలదిన్నె, రేణిమడుగు, కొండారెడ్డిపల్లి, మోపాడు తదితర ప్రాంతాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు.