APNews: బొమ్మలాపురంలో పెద్దపులి టెన్షన్

ABN , First Publish Date - 2022-06-09T19:34:51+05:30 IST

జిల్లాలోని పెద్దదోర్నాల మండలం బొమ్మలాపురంలో పెద్దపులి టెన్షన్ నెలకొంది.

APNews: బొమ్మలాపురంలో పెద్దపులి టెన్షన్

ప్రకాశం: జిల్లాలోని పెద్దదోర్నాల మండలం బొమ్మలాపురంలో పెద్దపులి టెన్షన్ నెలకొంది. నాలుగు రోజులుగా గండిచెరువు ప్రాంతంలో  పెద్దపులి సంచరిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పులిని చూసిన బొమ్మలాపురం గ్రామస్థులు... ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందజేశారు. వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని పెద్దపులి పాదముద్రలను సేకరించారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పెద్దపులి సంచారంతో  బొమ్మలాపురం గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2022-06-09T19:34:51+05:30 IST