Abn logo
Nov 28 2020 @ 08:51AM

ఆటో బోల్తా...ఉప్పుటేరులో ఇద్దరు గల్లంతు

ఒంగోలు: ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం పెదపవని దగ్గర శనివారం ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఉప్పుటేరులో ఆటో పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గల్లంతైన వారికోసం స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైనవారు మొగిలిచెర్లకు చెందిన బాబూరావు, అజయ్‌గా గుర్తించారు. 

Advertisement
Advertisement
Advertisement