రైస్‌ మిల్లుల్లో విస్తృత తనిఖీలు

ABN , First Publish Date - 2020-09-26T20:55:38+05:30 IST

రైస్‌ మిల్లుల్లో విస్తృత తనిఖీలు

రైస్‌ మిల్లుల్లో విస్తృత తనిఖీలు

సంతనూతలపాడు, సెప్టెంబరు 25 :  అక్రమంగా ఓ రైస్‌మిల్‌లో నిల్వ ఉంచిన వెయ్యి బస్తాల పీడీఎస్‌ బియ్యాన్ని శుక్రవారం సాయంత్రం పోలీసులు, రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు రూరల్‌ సీఐ టి.సుబ్బారావు తెలిపిన వివరాల మేరకు సంతనూతల పాడులోని నాగరాజ ట్రేడర్స్‌ అనే రైసు మిల్‌పై అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పీడీఎస్‌ బియ్యం 50 కేజీల బ స్తాలు 500, మరో రెండు రూముల్లో కుప్పలగా పోసిన బియ్యం 500 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. రైస్‌మిల్‌లో పనిచేస్తున్న నిర్వాహకుడి వద్ద నుంచి వివరాలు తీసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నామన్నారు. ఈ దాడుల్లో ఎస్సై దాసరి రాజారావు, రెవె న్యూ అధికారులు పాల్గొన్నారు.


పొదిలిలో 123 బస్తాలు 

పొదిలి : స్థానిక మార్కాపురం అడ్డరోడ్డు సమీపంలో ఉన్న రైస్‌మిల్లుపై శుక్రవారం ఎస్సై కె.సురేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్‌ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన 123 బస్తాల రేషన్‌ బియ్యాన్ని స్వాదీనం చేసుకున్నారు. 


వెల్లపల్లిలో పోలీసులు తనిఖీలు 

మద్దిపాడు : వెల్లంపల్లి శ్రీనివాసరావు రైసుమిల్లులో శుక్రవారం రాత్రి మద్దిపాడు ఎస్సై ఫిరోజ్‌ ఫాతిమా రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. పేదలకు అందించాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న అనుమానంతో తనిఖీలు నిర్వహించారు. ఆ రైస్‌ మిల్లుల్లో బియ్యం లేవని, కేవలం నూకలు ఉన్నాయని ఆమె తెలిపారు. 


దర్శిలో దాడులు

దర్శి : దర్శి పట్టణంలోని పొదిలి రోడ్డులోగల రైస్‌ మిల్లులో రెవెన్యూ. పోలీసు అధికారులు శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఇన్‌చార్జి  తహసీల్దార్‌ దేవసహయం, దర్శి సీఐ మహ్మద్‌ మొయిన్‌, ఎస్సై రామకోటయ్యలు మిల్లులో నిల్వ ఉన్న బియ్యాన్ని పరిశీలించారు. కొంత బియ్యాన్ని బస్తాలకు ఎత్తి ఉన్నాయి. మొత్తం సుమారు 1200 బస్తాలు బియ్యం ఉం టాయని అధికారులు చెప్పారు. ఈ బియ్యం పీడీఎస్‌కు చెందినవా..? లేక రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి నిల్వ చేశారా..? అనే విషయం తేలా ల్సి ఉంది. బియ్యం నమూనాలను ఒంగోలు పంపించి నిల్వ ఉన్న బియ్యం ఏమిటనే విషయం నిర్ధారిస్తామని ఇన్‌చార్జి తహసీల్దార్‌ దేవసహాయం తెలిపారు.


కొండపిలోని పొదిలి రోడ్డులో గల రైస్‌ మి ల్లును శుక్ర వారం సాయంత్రం శింగరాయ కొండ సీఐ యు.శ్రీనివాసులు, ఎస్సై వి.రాం బాబు, ఎమ్మారై హనుమంతరావు, వీ ఆర్వో శ్రీనివాసరావు, పోలీసు సిబ్బంది తనిఖీ చేశారు. జిల్లాలోని పలు ప్రాం తాల్లో రేషన్‌ బియ్యం పట్టుపడిన నేప థ్యంలో రెవెన్యూ, పోలీసు శాఖ ఉన్నతాధి కారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేశామని అధికారులు తెలిపారు. మిల్లులో రేషన్‌ బి య్యం ఏమీ పట్టు పడలేదని అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మిల్లును నడపవద్దని, అలా నడిపితే కఠిన చర్యలు తీసుకుం టా మని అధికారులు మిల్లు నిర్వాహకులను, సిబ్బం దిని హెచ్చరించారు.


రెండు చోట్ల  850 బియ్యం పట్టివేత


ఎర్రగొండపాలెం : సాయిబాలాజీ రైస్‌ మిల్లు, వెంకటసాయి రెస్‌ మిల్లుల్లో మొత్తం 850 బియ్యం బస్తాలను శుక్రవారం అధికారులు పటు కున్నారు. శుక్రవారం రాత్రి సీఐ పీ దేవప్రభాకర్‌ సిబ్బందితో ఆక స్మికంగా మిల్లులో సోదాలు నిర్వహించారు. 50 కేజీలున్న 450 బియ్యం బస్తాలను సాయిబాలాజీ రైస్‌ మిల్లులో గుర్తించారు. వాటిని వీఆర్వోకు అప్ప గిస్తామని చెప్పారు. హెచ్‌సీ న్యూటన్‌, పోలీసులు రాజేంద్ర పాల్గొన్నారు. అలాగే ఎస్‌ఐ ముక్కంటి ఆధ్వర్యంలో వెంకటసాయి రెస్‌ మిల్లులో తనిఖీ చేయగా 400 బస్తాలు పట్టుబట్టాయి. అయితే బీపీటి బియ్య అని రైస్‌ మి ల్లు యజమానులు చెప్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు నిర్ధారిం చాల్సి ఉందని ఎస్‌ఐ తెలిపారు. 


పెద్దారవీడు : మండలంలోని వైడిపాడు, హనుమాన్‌ జంక్షన్‌ కుంట గ్రామాలలో రైస్‌ మిల్లుల్లో ఎస్‌ఐ రామకృష్ణ తనిఖీలు నిర్వహించారు. వైడిపాడులోని మిల్లులో నిల్వఉన్న బియ్యాన్ని పరిశీలించారు.  హనుమాన్‌జంక్షన్‌ కుంటలో రేషన్‌షాపును తనిఖీ చేశారు. 


గిద్దలూరులో సోదాలు

గిద్దలూరు టౌన్‌ : మార్టూరు ప్రాంతంలో రేషన్‌ బియ్యం అక్రమంగా నిలువ చేయగా పోలీసుల తనిఖీల్లో బయటపడ్డాయి. జిల్లా అధికారుల ఆదేశానుసారం శుక్రవారం సాయం త్రం గిద్దలూరు ప్రాంతంలో ఉండే 3 రైస్‌మిల్లులను ఎస్‌ఐ రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ముమ్మరంగా తని ఖీలు చేశారు. మిల్లులలో స్టాక్‌ రిజిష్టర్లను పరిశీలించారు. అన్ని బియ్యం బస్తాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఎక్కడ కూడా రేషన్‌బియ్యం నిలువలు కనిపించలేదు. ఈసందర్భంగా ఎస్‌ఐ రవీంద్రరెడ్డి మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశానుసారం పట్టణంలోని కొత్తపల్లి రోడ్డు, నంద్యాల రోడ్డు, ముండ్లపాడు రోడ్డులలో ఉండే 3 రైస్‌మిల్లులను తనిఖీలు చేశామని, ఎటువంటి రేషన్‌బియ్యం లభ్యం కాలేదన్నారు. అక్రమంగా రేషన్‌బియ్యాన్ని నిలువ ఉంచిన, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


కురిచేడు : కురిచేడులోని ఓ రైస్‌ మిల్లులో పోలీసులు శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. అయితే ఆ మిల్లులో ఎటవంటి రేషన్‌ బియ్యం లేవని ఎస్‌ఐ శివనాగరాజు తెలిపారు. ఆయన వెంట ఏఎస్సై వెంకటేశ్వర రెడ్డి, కానిస్టేబుళ్లు ఉన్నారు.


500 బస్తాల బియ్యం నిల్వల గుర్తింపు  

అద్దంకి : అద్దంకి పట్టణంలోని రైస్‌ మిల్లుల్లో పోలీసులు శుక్రవారం రాత్రి తనిఖీలు చేశారు. ఆయిల్‌ మిల్‌రోడ్డులోని మహాలక్ష్మి రైస్‌మిల్‌లో సుమారు 500  బస్తాల బియ్యం కుప్పగా పోసి ఉన్నాయి. నిల్వ ఉన్న బి య్యం రేషన్‌ బియ్యమా... కాదా అన్న విషయం అధికారులు పరిశీలించి నిర్ధారించాల్సి ఉందని ఎస్సై మహేష్‌ తెలిపారు. నిల్వ ఉన్నవి రేషన్‌ బి య్యమే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే రైస్‌మిల్‌ అడ్డాగా రేషన్‌ బియ్యం రీసైక్లిలింగ్‌ జరుగు తున్నదన్నది జగమెరిగిన సత్యం. పలుమార్లు అధికారుల తనిఖీలలో రేషన్‌ బియ్యం పట్టుబడ్డాయి. మార్టూరు మండలం వలపర్లలో ఓరైస్‌ మి ల్లులో  పోలీసులు తనిఖీలు చేసి భారీగా రేషన్‌ బియ్యం పట్టుకున్నారు. వలపర్లలో రైస్‌ మిల్‌ లీజుకు తీసుకొని రేషన్‌ దందా నిర్వహిస్తూ పట్టు బడ్డ వ్యక్తులు అద్దంకికి చెందిన వారు కావడంతో పాటు గతంలో అద్దం కిలో రేషన్‌ దందా నిర్వహించిన వారే కావడం విశేషం. ఆముఠా తమ కేంద్రాన్ని వలపర్లకు మార్చగా అద్దంకిలో రైస్‌మిల్‌ను అడ్డాగా చేసుకొని కొత్త బ్యాచ్‌ రేషన్‌ దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.  

Updated Date - 2020-09-26T20:55:38+05:30 IST