Advertisement
Advertisement
Abn logo
Advertisement

Prakasam: మినీలారీని వదిలి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కొల్లూరుపాడు వద్ద ఐషర్ మినీ లారీని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. స్థానికులు సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు  వాహనంలో విలువైన ఫ్యాన్లు, బట్టలు ఉన్నట్లు గుర్తించారు. వాహనాన్ని స్వాదీనం చేసుకుని విచారిస్తున్నారు.  దొంగలే వాహనాన్ని వదిలివెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కావలి ముసునూరు టోల్ గేటు నుండి పోలీసులు వెంబడించటంతో  ఉలవపాడు మండలం కొల్లూరుపాడు ఆది ఆంధ్ర కాలని వద్ద వాహనాన్ని వదిలి పారిపోయినట్టు విచారణలో తెలిసినట్టు  పోలీసులు చెబుతున్నారు.

Advertisement
Advertisement