Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒంగోలు కలెక్టరేట్‌లో టంగుటూరి జయంతి వేడుకలు

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్‌లో స్వాతంత్ర్య సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సి పోతుల సునీత, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మలిక గర్గ్ మరియు పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం జయంతి సందర్భంగా  మంత్రులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేవరంపాడులో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 

Advertisement
Advertisement