‘ప్రజావాణి’ అర్జీలను వెంటనే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-05-17T05:17:07+05:30 IST

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ జిల్లా అధికారులను ఆదేశించారు.

‘ప్రజావాణి’ అర్జీలను వెంటనే పరిష్కరించాలి
ప్రజావాణిలో అర్జీలను స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్లు ముజామిల్‌ఖాన్‌, శ్రీనివా్‌సరెడ్డి

 జిల్లా అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌

సిద్దిపేట అగ్రికల్చర్‌, మే 16: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డితో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రజావాణికి వస్తారని, ఈ కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులందరూ పాల్గొంటే నేరుగా సమస్యలను ఆయాశాఖల అధికారులు పరిశీలించి త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో అదనపు కలెక్టర్లు ముజామిల్‌ఖాన్‌, శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ రైతులు వరిసాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా జిల్లా రైతులకు అవగాహన కల్పించి చైతన్యం చేయాలని వ్యవసాయ, ఉద్యానవనశాఖ, మండల ప్రత్యేకాధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలు, పురోగతి, వానాకాలం పంటల సాగు ప్రక్రియపై జిల్లా అధికారులకు దిశానిర్ధేశం చేశారు. 20 నుంచి పల్లె, పట్టణప్రగతి కార్యక్రమం ప్రారంభంకానున్న దృష్ట్యా అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-17T05:17:07+05:30 IST