సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి

ABN , First Publish Date - 2022-10-04T05:10:30+05:30 IST

ప్రజల సమస్యల పరి ష్కారం కోసమే ప్రజవాణి కార్యక్రమం నిర్వహిస్తు న్నామని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీక రించారు.

సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి
అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

 - కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ఆసిఫాబాద్‌, అక్టోబరు 3: ప్రజల సమస్యల పరి ష్కారం కోసమే ప్రజవాణి కార్యక్రమం నిర్వహిస్తు న్నామని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీక రించారు. కాగజ్‌నగర్‌ మండల నజ్రుల్‌నగర్‌ గ్రామా నికి చెందిన అశోక్‌ దేవ్‌నాథ్‌ తన తండ్రికి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం అసైన్డ్‌ చేసిన భూమిని తనపేరిట విరాసత్‌ చేశారని, తెలంగాణ ప్రభుత్వం నూతన పట్టాదారు పాసు పుస్తకం, ధరణి పోర్టల్‌లో వేరే వారి పేరు నమోదయిందన్నారు. సవరించి తన పేరిట నమోదు చేయాలని దరఖాస్తు అందజేశారు. పెంచి కలపేట మండలం ఎల్కపల్లి గ్రామానికి చెందిన సంగర్సు సాయిరాధా తన మామయ్య పేరుతో ఉన్న ఇంటిని తన పేరిట మార్పు చేయాలని అర్జీ సమ ర్పించారు. రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన వేముల చంద్రయ్య అటవీహక్కు కోసం తాను దరఖాస్తు చేసుకున్నానని సర్వే జాబితాలో తనపేరు నమోదు కాలేదన్నారు. పేరు చేర్చాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. వాంకిడి మండలం ఎనగొంది గ్రామానికి చెందిన మడావి కల్పన తాను ఇంటర్మీడియట్‌ పూర్తి చేశానని, హ్యాండ్‌బాల్‌, సాహస క్రీడలలో రాణించి ధ్రువీకరణపత్రాలు పొందానన్నారు. నిరుపేదైన తనకు ఆశ్రమ పాఠశాలలో ఉపాధికల్పిం చాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కెరమెరి మండలం ఇందాపూర్‌ గ్రామానికి చెందిన గవుత్రే నాగుబాయి తన కూతురు పెళ్లికి సంబంధించిన కల్యాణలక్ష్మి చెక్కుమంజూ రయిందని తనబ్యాంకు ఖాతా నుంచి డబ్బులు విడుదల చేయా లని దరఖాస్తు అందజేశారు. జిల్లా లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆర్జిస్టులు, పెయింటర్లు ఆదివాసీ గిరిజన కులానికి చెందిన నిరు పేదలైన తమకు జిల్లాలో ప్రభు త్వానికి సంబంధించి పెయింట్‌ పనులు మంజూరు చేసి ఆదుకో వాలని దరఖాస్తు అందజేశారు.

Updated Date - 2022-10-04T05:10:30+05:30 IST