వాళ్లు దివాళా తీసినట్లే.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-05-23T01:15:54+05:30 IST

తెలంగాణలో తనకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అప్పులు లేకుండా చేస్తానని కేఏపాల్ అన్నారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించిన నేపథ్యంలో..

వాళ్లు దివాళా తీసినట్లే..  కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

Hyderabad: తెలంగాణలో తనకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అప్పులు లేకుండా చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ (Ka Paul) అన్నారు. కేంద్రం పెట్రోల్, డీజిల్  (Petrol, Diesel) రేట్లు తగ్గించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే.. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశం మొత్తం అన్ని వస్తువుల ధరలు పెరిగాయన్నారు. గెలుచినవారు వేల కోట్లు సంపాదిస్తున్నారని.. అక్రమంగా సంపాదించినా డబ్బులతో ఎన్నికలకు వెళుతున్నారని మండిపడ్డారు.


బీజేపీ (Bjp) అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు అవుతోందని.. ఇప్పటివరకూ  మొత్తం రూ. 50 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ (Andhrapradesh)లో రూ. 7 లక్షల కోట్లు అప్పు ఉందని వ్యాఖ్యానించారు.  ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారంటే వాళ్ళు దివాళా తీసినట్లేనన్నారు. కాంగ్రెస్ (Congress) వాళ్లకి ఓటు పర్సెంటేజ్ లేక పిచ్చి పట్టి తిరుగుతున్నారన్నారు. పొత్తులు పెట్టుకోమని అన్ని పార్టీల వాళ్లు తమ దగ్గరకి వస్తున్నారని కేఏ పాల్ తెలిపారు. 


Updated Date - 2022-05-23T01:15:54+05:30 IST