ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలి

ABN , First Publish Date - 2022-08-07T06:23:14+05:30 IST

ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలి

ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలి
సిరివాడలో జరిగిన బాదుడే బాదుడులో కరపత్రాలు పంపిణీ చేస్తున్న బచ్చుల అర్జునుడు

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, ఆగస్టు 6 : ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, వివిధ రకాలపన్నులతో, చార్జీల పెంపుతో ప్రజానీకానికి, రైతాంగానికి అన్యాయం చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపా ల్సిన సమయం ఆసన్నమైందని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. సిరివాడ టీడీపీ ఆధ్వర్యంలో శనివారంనిర్వహించిన బాదుడేబాదుడు, ప్రతి ఇంటికీ తెలుగు దేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కరెంటు, ఆర్టీసీ చార్జీలు, ఇంటిపన్ను, నిత్యా వసరాల ధరల పెంపుపై కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేస్తూ వైసీపీ ప్రభు త్వం ప్రజలను ఏవిధంగా దోచుకుం టుందో వివరించారు. కూడలిలో మహిళ లతో ముఖాముఖి నిర్వహించారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు తదితర విషయాలపై ఆరా తీశారు.   ఈ కార్యక్రమంలో టీడీపీ నాయ కులుదయాల రాజేశ్వరరావు, పుట్టా సురేష్‌,  ఎర్రిబోయిన కుమారస్వామి,  సుందరం, గుండపనేని ఉమావరప్రసాద్‌, వేములపల్లి శ్రీనివాసరావు, యనమదల వెంకయ్యా రావు, చెన్నుబోయిన శివయ్య, మజ్జిగ నాగరాజు, మొవ్యా వెంకటేశ్వర రావు, కంపసాటి కొండ, బొమ్మదేవర సత్యనారా యణరావు పాల్గొన్నారు.

పేదల పొట్టగొడుతున్న వైసీపీ 

పెనమలూరు  : మూడేళ్లుగా జగన్‌ రెడ్డి ప్రభుత్వం పేదల పొట్టగొట్టి నిలువునా దోపిడీ చేస్తోందని టీడీపీ పెనమలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బోడె ప్రసాద్‌  విమర్శించారు. తాడిగడప మునిసిపాలిటీ ఒకటవ డివిజనులో శనివారం జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం నిత్యా వసర వస్తువుల ధరలను పెంచటంతో పాటు అనేక రకాల పన్నులను విధిస్తూ పేదల నడ్డి విరుస్తోందని విమర్శించారు. సామాన్యుల బతుకు దుర్భరం కావడానికి జగన్‌రెడ్డి ప్రభుత్వం ప్రధాన కారణమని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జగన్‌ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే కరపత్రాలను పంచి పెట్టారు.   ఒక చేత్తో పిసరంత విదిలిస్తూ పది చేతులతో పరో క్షంగా కొండంత పిండుతున్నారని విమర్శిం చారు. ప్రజలు వాస్తవాలను గమనించి వచ్చే ఎన్నికల్లో జగన్‌రెడ్డి ప్రభుత్వానికి గట్టి బుద్ది చెప్పాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో తాడిగడప మునిసిపాలీటీ టీడీపీ  అధ్యక్షుడు అనుమోలు ప్రభాకర్‌,  సీనియర్‌ నాయకులు ఆచంట వెంకట చంద్ర, అన్నె రోమన్‌బాబు, తోటకూర సత్య నారాయణ, చనుమోలు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-07T06:23:14+05:30 IST