Abn logo
Sep 30 2021 @ 12:07PM

Praja Sangrama Yatra: హుస్నాబాద్‎లో ముగింపు సభ

హుజురాబాద్: బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను పార్టీ నేతలు ప్రకటించారు. హుజురాబాద్ ఉపఎన్నిక టార్గెట్‌గా ముందుకెళ్తోన్న సంగ్రామ యాత్ర ముగింపు సభను అక్టోబర్ 2న హుస్నాబాద్‎లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. అయితే.. షెడ్యూల ప్రకారం హుజురాబాద్‎లో ముగింపు సభ అనుకున్నారు. కానీ..ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో సభను హుస్నాబాద్‎లో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ‘తెలంగాణ మాదే.. హుజురాబాద్ మాదే’నంటూ కమలనాథులు ఫుల్ జోష్‎లో ఉన్నారు. హుస్నాబాద్‌లో ఉపఎన్నిక శంఖారావం పూరించనున్నట్లు వెల్లడించింది. ఈ సభ ద్వారా ఈటల గెలుపునకు స్పష్టమైన సంకేతాలు పంపాలని బీజేపీ యోచిస్తోంది. హుస్నాబాద్‎లో భారీ జనసమీకరణపై బీజేపీ దృష్టి సాధించింది.


కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర..

నేడు కోహెడ మండలంలో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది. శ్రీరాములపల్లి, పర్వేద, పందిళ్ల మీదుగా పొట్లపల్లి వరకు కొనసాగనుంది. మొదటి దశ పాదయాత్ర ముగింపు సభ అక్టోబర్ 2న హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది.


హుజురాబాద్ బై పోల్ షెడ్యూల్ ఇలా...

తెలంగాణ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది. అక్టోబర్ 1 న హుజురాబాద్‌ నోటిఫికేషన్ విడుదల కానుండగా… నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8 వరకు ఉండనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన ఉండనుండగా… నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13 వరకు ఉన్నట్లు స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండిImage Caption