కిలో రూపాయి

ABN , First Publish Date - 2022-08-13T05:41:23+05:30 IST

నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్లో శుక్రవారం కిలో టమోటా ధర ఒక్క రూపాయి పలికింది.

కిలో రూపాయి
మార్కెట్లో ధరలపై నిరసన వ్యక్తం చేస్తున్న టామోటా రైతు హరి

 పడిపోయిన టమోటా ధర
 గగ్గోలు పెడుతున్న రైతులు


ప్యాపిలి, ఆగస్టు 12: నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్లో శుక్రవారం కిలో టమోటా ధర ఒక్క రూపాయి పలికింది.  రెండు రోజులుగా ఇదే పరిస్థితి. దీంతో మార్కెట్‌కు వచ్చిన రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుత ధరలతో కనీసం రవాణ ఖర్చులు కూడా రావడం లేదని పెద్దపూదిళ్ల, కలచట్ల, ప్యాపిలి, శభా్‌షపురం తదితర గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో ధర పతనమైనా పట్టించుకునే వారే కరువయ్యారని వాపోతున్నారు. కిలో ఒక్క రూపాయి ధర పలికినా వ్యాపారులకు మాత్రం కమీషన్‌ ఇవ్వక తప్పడం లేదని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి టామోటాకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.


Updated Date - 2022-08-13T05:41:23+05:30 IST