సింహ వాహనంపై ప్రహ్లాదరాయలు

ABN , First Publish Date - 2022-08-13T05:38:35+05:30 IST

పూర్వారాధన మహోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు సింహ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.

సింహ వాహనంపై ప్రహ్లాదరాయలు
సింహ వాహనంపై ఊరేగుతున్న ప్రహ్లాదరాయలు

మంత్రాలయం, ఆగస్టు 12: పూర్వారాధన మహోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు సింహ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. బంగారు రథంపై రాఘవేంద్రులను ఘనంగా ఊరేగించారు. శ్రీరంగం నుంచి అధికారికంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సింహ వాహనుడైన ప్రహ్లాదరాయలు చెక్క, వెండి, బంగారు రథాలపై ఊరేగారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, సింగిల్‌ విండో అధ్యక్షుడు ప్రదీప్‌ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. పూర్వాధనలో భాగంగా చెన్నైకి చెందిన విద్వాన్‌ గణేష్‌ చే దాసవాని సాహిత్యం, మంగళూరుకు చెందిన శ్రీనివాస కళ్యాణ యక్షజ్ఞ కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత విద్వాన్‌ రాజా ఎస్‌ గిరిరాజాచార్‌, సుజీంద్రాచార్‌, గౌతమాచార్‌, ఆనంద తీర్థాచార్‌, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి, శ్రీపతిఆచార్‌, పూజారి వ్యాస రాజాచార్‌, సీఆర్‌వోలు రవి కులకర్ణి, విజయేంద్రాచార్‌, జయతీర్థాచార్‌, ఈఈ సురేష్‌ కోనాపూర్‌, ఏఈ బద్రినాథ్‌, ద్వారపాలక అనంత స్వామి, ప్రకాష్‌ ఆచార్‌, బీఎం ఆనందరావు, మంత్రాలయం సీఐ భాస్కర్‌, ఎస్‌ఐ వేణుగోపాల్‌ రాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-13T05:38:35+05:30 IST