టాప్‌లో ప్రజ్ఞానంద

ABN , First Publish Date - 2022-08-20T10:56:11+05:30 IST

భారత టీనేజ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద అమెరికన్‌ ఫినాలె చాంపియన్స్‌ చెస్‌ టూర్‌ టోర్నీలో జోరు కొనసాగిస్తున్నాడు.

టాప్‌లో ప్రజ్ఞానంద

అమెరికన్‌ చెస్‌లో నాలుగో  విజయం

మియామి: భారత టీనేజ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద అమెరికన్‌ ఫినాలె చాంపియన్స్‌ చెస్‌ టూర్‌ టోర్నీలో జోరు కొనసాగిస్తున్నాడు. శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్‌లో అతడు 3-1తో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ లెవాన్‌ అరోనియన్‌ (అమెరికా)కు షాకిచ్చాడు. దాంతో ఈ ఎఫ్‌టీఎక్స్‌ క్రిప్టో కప్‌లో ప్రజ్ఞానంద వరుసగా నాలుగో విజయం అందుకున్నాడు. ఫలితంగా.. 17 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్‌ 12 పాయింట్లతో వరల్డ్‌ నెం.1 మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక నాలుగో రౌండ్‌లో కార్ల్‌సన్‌ 3-1తో క్వాంగ్‌ లియమ్‌ (చైనా)పై నెగ్గాడు. 

Updated Date - 2022-08-20T10:56:11+05:30 IST