బీజేపీ ఎంపీ ప్రగ్యా‌ఠాకూర్ కనిపించడం లేదంటూ పోస్టర్లు

ABN , First Publish Date - 2020-05-30T13:43:21+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి వల్ల భోపాల్ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే తమ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదని...

బీజేపీ ఎంపీ ప్రగ్యా‌ఠాకూర్ కనిపించడం లేదంటూ పోస్టర్లు

ఎయిమ్స్‌లో చేరినట్లు బీజేపీ కౌంటర్

భోపాల్ (మధ్యప్రదేశ్): కరోనా వైరస్ వ్యాప్తి వల్ల భోపాల్ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే తమ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదని... ‘‘తప్పిపోయిన ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కోసం వెతకండి’’ అంటూ భోపాల్ నగరంలో అంతటా పోస్టర్లు వెలిశాయి. భోపాల్ నగరంలోనే 1400 మందికి కరోనా వైరస్ సోకి ప్రజలు అల్లాడుతుంటే ఈ కష్టకాలంలో ఆదుకోవాల్సిన ఎంపీ ప్రగ్యాఠాకూర్ అదృశ్యమయ్యారని ఆరోపిస్తూ స్థానికులు పోస్టర్లు వేశారు.


కరోనా కష్ట సమయంలో ఎంపీ ప్రగ్యా ప్రజలకు సాయంగా నిలబడలేదని, ఇలాంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవద్దని భోపాల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కమలేశ్వర్ పటేల్ కోరారు. ‘‘ఓటర్లు ఒటు వేసే ముందు ఆలోచించాలి, ఒకవైపు ఓటమి పాలైన దిగ్విజయ్ సింగ్ భోపాల్ లో ప్రజల కోసం పనిచేస్తుంటే, ఇక్కడి నుంచి ఎన్నికైన ఎంపీ ప్రగ్యా మాత్రం ఎక్కడా కనిపించడం లేదు’’ అని కమలేశ్వర్ ఆరోపించారు. కాగా దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి రాహుల్ కొఠారీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ ను సమర్ధించారు. ప్రస్థుతం ఎంపీ ప్రగ్యా ఠాకూర్ ఎయిమ్స్ లో తన కంటికి, కేన్సర్ కు చికిత్స పొందుతున్నారని రాహుల్ కొఠారీ వివరణ ఇచ్చారు. 

Updated Date - 2020-05-30T13:43:21+05:30 IST