Jun 20 2021 @ 13:59PM

'ఎఫ్ 3'లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ సాంగ్..!

'ఎఫ్ 3'లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ సాంగ్ చేయబోతుందని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విక్టరీ వెంకటేష్ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా 'ఎఫ్ 2' సీక్వెల్‌గా రూపొందుతోంది. ఇప్పటికే సగానికి పైగా టాకీపార్ట్ పూర్తి అయిన ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాడట. వచ్చే నెల నుంచి సెట్స్ మీదక్కి వెళ్ళనున్న ఇందులో అనిల్ రావిపూడి ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సాంగ్ కోసం 'కంచె' బ్యూటీ ప్రగ్యా జైస్వాల్‌ని సంప్రదించనున్నట్టు తాజా సమాచారం. 'ఎఫ్ 2' లో అనసూయ భరద్వాజ్ స్పెషల్ సాంగ్ చేసి అలరించింది. ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్ 'ఎఫ్ 3'లో వెంకీ, వరుణ్‌లతో కలిసి స్టెప్పులేయబోతోందట. అయితే ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ రావాల్సి ఉంది. కాగా ఈమె ప్రస్తుతం బోయపాటి శ్రీను - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'అఖండ'లో హీరోయిన్‌గా నటిస్తోంది.