ప్రజ్ఞేష్‌ ముందంజ.. నగాల్‌ ఇంటికి

ABN , First Publish Date - 2020-09-22T09:36:44+05:30 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల అర్హత పోటీల్లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.

ప్రజ్ఞేష్‌ ముందంజ.. నగాల్‌ ఇంటికి

న్యూఢిల్లీ: ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల అర్హత పోటీల్లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రజ్ఞేష్‌ గుణేశ్వరన్‌ 6-3, 6-1తో సెమ్‌ ఇల్కెల్‌ (టర్కీ)పై విజయం సాధించి ముందంజ వేయగా, డస్టిన్‌ బ్రౌన్‌ చేతిలో పరాజయం పాలైన భారత్‌ టాప్‌ సీడ్‌ సుమిత్‌ నగాల్‌ ఇంటిముఖం పట్టాడు. జర్మనీ ఆటగాడు బ్రౌన్‌తో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో సుమిత్‌ 6-7, 5-7తో ఓడిపోయాడు. ఇక, కరోనా టెస్టుల్లో పాజిటివ్‌గా తేలిన ఇద్దరు ఆటగాళ్లు, ఒక కోచ్‌తో పాటు వారితో సన్నిహితంగా ఉన్న మరో ముగ్గురు క్రీడాకారులు టోర్నీ నుంచి తప్పుకున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.

Updated Date - 2020-09-22T09:36:44+05:30 IST