నెం.1కు ప్రజ్ఞానంద షాక్‌

ABN , First Publish Date - 2022-08-17T10:10:16+05:30 IST

భారత టీనేజ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద మరోసారి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

నెం.1కు ప్రజ్ఞానంద షాక్‌

మియామి: భారత టీనేజ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద మరోసారి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అమెరికన్‌ ఫినాలే ఆఫ్‌ చాంపియన్స్‌ చెస్‌ టూర్‌లో ఆదిలోనే ప్రపంచ జూనియర్‌ నెంబర్‌వన్‌ ఆటగాడు అలిరెజా ఫిరౌజా (ఇరాన్‌)కు షాకిచ్చాడు. తొలిరౌండ్‌ మ్యాచ్‌లో భాగంగా నాలుగు ర్యాపిడ్‌ గేమ్స్‌లో 17 ఏళ్ల ప్రజ్ఞానంద 2.5-1.5తో తనకంటే ర్యాంకుల్లో ఎంతో మెరుగైన అలిరెజాను ఓడించాడు. మరో మ్యాచ్‌లో కార్ల్‌సన్‌ 3-1తో అనీష్‌ గిరిపై గెలిచాడు. రెండోరౌండ్లో నెదర్లాండ్స్‌ టాప్‌ ఆటగాడు అనీష్‌ గిరితో ప్రజ్ఞానంద తలపడతాడు.  

Updated Date - 2022-08-17T10:10:16+05:30 IST