ప్రగతిపథంలో గూడూరు డివిజన్‌!

ABN , First Publish Date - 2022-01-27T04:30:30+05:30 IST

గూడూరు డివిజన్‌ ప్రగతి పథంలో పయనిస్తోందని ఆర్డీవో మురళీకృష్ణ అన్నారు. గణతం త్ర దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో ఆర్డీవో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిం చారు.

ప్రగతిపథంలో గూడూరు డివిజన్‌!
మాట్లాడుతున్న ఆర్డీవో మురళీకృష్ణ

గూడూరు, జనవరి 26: గూడూరు డివిజన్‌ ప్రగతి పథంలో పయనిస్తోందని ఆర్డీవో మురళీకృష్ణ అన్నారు. గణతం త్ర దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో ఆర్డీవో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిం చారు. ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు, స్వచాంధ్ర కార్పొరేషన్‌ చైర్‌ పర్సన్‌ పొణకాదేవసేన ఉత్తమ సేవలందించిన పలువురికి పురస్కారాలను అందజేశారు. తహసీల్దారు లీలారాణి, కమిషన ర్‌ శ్రీకాంత్‌, ఎంఈవో సునీల్‌, వరకుమార్‌, బొమ్మిడి శ్రీనివాసు లు, తాళ్లూరు శ్రీనివాసులు తదితరులు పాలొ ్గన్నారు.  డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి, మున్సిపల్‌  కమిషనర్‌ శ్రీకాంత్‌,  ఇన్‌చార్జి ఆ ర్టీవో మురళీమోహన్‌, రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ పీవీరావు, ఎస్‌ఐలు కొండప్ప నా యుడు, లక్ష్మీనారాయణ,  చిల్లకూరు ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎస్‌ఐలు సుధాకర్‌రెడ్డి, అజయ్‌కుమార్‌ వారివారి కార్యాలయాల్లో పతాకావిష్కరణ చేశారు. 

వెంకటగిరి(టౌన్‌): 9వ బెటాలియన్‌లో కమాండెంట్‌ ఎం. నాగేంద్రరావు జెండా వందనం చేశారు. ఎంపీపీ తనూజా రెడ్డి, ఎంపీడీవో కే. వెంకటేశ్వర రావు, డీటీ అర్చన, వారి కార్యాల యాల్లో వేడుకలు నిర్వహించారు. వెమల పాళెంలో గుమ్మళ్లపు ఢిల్లీబాబు, కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి జెండా ఎగురవేశారు. 

వెంకటగిరి: టీడీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి కేవీకే ప్రసాద్‌ నాయుడు,  బీరం రాజేశ్వరరావు, పప్పురెడ్డి చంద్రమౌళిరెడ్టి, పునుగోటి విశ్వ నాథం, టీవీఆర్‌, మల్లారం బాబు, తాండవచంద్రారెడ్డి, మంకు ఆనంద్‌, మగ్గం వెంకటా చలం తదితరులు పాల్గొన్నారు.

సైదాపురం: విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.  తహసీల్దార్‌ పి కృష్ణ, ఎంపీడీవో వాణిరెడ్డి, ఎస్‌ఐ ఉమా శంకర్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

డక్కిలి: తహసీల్దార్‌ ప్రసాద్‌, జడ్పీటీసీ సభ్యురాలు కలిమలి రాజ్యలక్ష్మి, ఎంపీపీ రాజశేఖర్‌, గురుకుల కళాశాలప్రిన్సిపాల్‌ ఎస్తేరమ్మ,  ఎస్‌ఐ నరసింహరావు,  వైద్యాధికారి సుధీర్‌ బాబు,్ల హెచ్‌ఎంలు సుబ్రమణ్యం,  దూడల పెంచలయ్య వారి వారి కార్యాలయాల వద్ద  జెండా ఎగరవేశారు. 

చిట్టమూరు : తహసీల్దార్‌ మునిలక్ష్మి, ఈవోపీఆర్‌డీ మనోహర్‌గౌడ్‌,  ఎస్‌ఐ గోపి,  ఎంఈవో బీవీ కృష్ణయ్య వారివారి కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. 

కలువాయి :  సీఐ సంగమేశ్వరరావు, ఎంపీడీవో నారసింహరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు బి.అనిల్‌కుమార్‌రెడ్డి, కలువాయి సర్పం చు డి.పెంచలమ్మ పాల్గొన్నారు. బస్టాండులో ఏడీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు నిజమాల ప్రసాద్‌ నివాళుర్పించారు.బీజేపీ మండల అధ్యక్షుడు డి.పెంచలయ్య  పాల్గొన్నారు. 

రాపూరు:  అన్ని కార్యాలయాలు, విద్యా సంస్థలు, కండలేరు డ్యాం, పెంచలకోనలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

వాకాడు :ఎంపీడీవో గోపీనాథ్‌, ఎంఈవో బాబు, సొసైటీ చైర్మన్‌ కొడవలూరు భక్తవత్సల్‌ రెడ్డి, ఎస్‌ఐ రఘునాథ్‌, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ కోటేశ్వరరావు తమతమ కార్యా ల యాల్లో జెండా ఎగురవేశారు. ముట్టెంబాక సచివాల యంలో సర్పంచ్‌ అనిల్‌కుమార్‌రెడ్డి, రావిగుంటపాళెంలో మండల వ్యవసాయ  కమిటీ అధ్యక్షుడు దువ్వూరు అజిత్‌ కుమార్‌ రెడ్డి, వాకాడులో పాపారెడ్డి రాజశేఖర్‌రెడ్డి, తిరుమూరులో ఎంపీటీసీ పుట్టేటి కృష్ణారెడ్డి, వాలమేడులో సర్పంచ్‌ రౌతు శంకరమ్మ, వల్లమేడులో సర్పంచ్‌బాలరాజు, పూడిరాయ దొరువులో ఉప సర్పంచ్‌ వెంకటరత్నం జెండాఎగురవేశారు.  

కోట :   తహసీల్దారు పద్మావతి, ఎంపీపీ అంజమ్మ,  సీఐ హరికృష్ణ, గూడలి సర్పంచ్‌ ఆదెమ్మ, ఉపసర్పంచ్‌ పల్లెమల్లు విజయసారఽథి రెడ్డి వారివారి కార్యాలయాల్లో జెండా ఎగురవేశారు.



Updated Date - 2022-01-27T04:30:30+05:30 IST