HYD: ప్రగతిభవన్ వద్ద భారీ బందోబస్తు

ABN , First Publish Date - 2022-01-12T17:08:50+05:30 IST

ప్రగతిభవన్‌ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

HYD: ప్రగతిభవన్ వద్ద భారీ బందోబస్తు

హైదరాబాద్: ప్రగతిభవన్‌ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 317జీవోను నిలిపివేయాలంటూ  ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. దాదాపు నాలుగు వందల మందితో ప్రగతి భవన్ ముట్టడికి యత్నించే అవకాశం ఉంది. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-01-12T17:08:50+05:30 IST