Oct 28 2021 @ 11:27AM

తీన్మార్ స్టెప్పులతో సీటీమార్ కొట్టించిన ప్రగతి

టాలీవుడ్ లో టాలెంటెడ్ ఫిమేల్ కేరక్టర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రగతి చాలా ప్రత్యేకం. ఆవిడ ఆన్ స్ర్కీన్ అపీరెన్స్ వేరు, ఆఫ్ స్ర్కీన్ బిహేవియర్ వేరు. ఒక పక్క సినిమాలు చేస్తూ.. మరో పక్క సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా డ్యాన్స్ లో ఆవిడ ప్రతిభ అమోఘం. ఎరోబిక్స్ లో కూడా ఆమె టాలెంట్ అద్భుతం. ఎంతో ఎనర్జీతో అద్భుతమైన స్టెప్పులతో డ్యాన్స్ చేస్తూ ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ కు షాకిస్తూంటారు ప్రగతి. ఐదుపదులకు చేరువయ్యే ఈ వయసులో కూడా ఆమె ఎనర్జీ, వేగం ఏమాత్రం తగ్గడంలేదు. తాజాగా ఆమె చేసిన తీన్మార్ డ్యాన్స్ వీడియో చూస్తే మతిపోవడం ఖాయం. 



తాజాగా ప్రగతి తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. కుర్రోళ్ళతో సమానంగా స్పీడ్ చూపిస్తూ.. తీన్మార్ మ్యూజిక్ కు అనుగుణంగా చెలరేగిన పోయిన ఆమె డ్యాన్సింగ్ టాలెంట్‌కు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఆ వీడియోకి ఒక్కరోజులో 20,783 లైక్స్ వచ్చి పడ్డాయి. ప్రగతి ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ‘మీకున్న పిచ్చిని బైటికి తీసుకొచ్చే అవకాశాన్ని మీరు ఎన్నడూ వదులుకోకండి.. బాయ్స్ కు ధన్యవాదాలు’.. అంటూ ఓ వ్యాఖ్యను జతచేశారు. ఆమె డ్యాన్స్ ను ప్రశంసిస్తూ  ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి.