నందీశ్వరునికి అభిషేకాలు చేస్తున్న ఆలయ అర్చకులు
నాగలాపురం, జనవరి 26: సురుటుపల్లె పల్లికొండేశ్వర ఆలయంలో మంగళవారం సాయంత్రం నందీశ్వరుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చందనం పన్నీరులతో అభిషేకాలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం నందీశ్వరుడినికి పుష్పాలంకరణ జరిపి మహా, కుంభ, నక్షత్ర హారతులు పట్టారు. తదనంతరం ఆలయ మూలస్థాన మూర్తులైన వాల్మీకేశ్వరస్వామి, మరగదాంబిక అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రాకారోత్సవం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలను ఆలయ చైర్మన్ ఏవీఎం మునిశేఖర్‌రెడ్డి, సభ్యులు జయప్రకాష్, గీతామురళి, గీతానారాయణన్, రమణి, సురేష్ తదితరులు పర్యవేక్షించారు.