ప్రధానితో సెల్ఫీలు సిగ్గుచేటు

ABN , First Publish Date - 2022-07-06T06:54:41+05:30 IST

ప్రధానితో సెల్ఫీలు సిగ్గుచేటు

ప్రధానితో సెల్ఫీలు సిగ్గుచేటు
మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

లబ్బీపేట, జూలై 5 : గత ఎన్నికల్లో తనకు ఎక్కువ మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్‌ ఆ విషయం మరచి మోడితో సెల్ఫీలు దిగడానికి పోటీపడటం సిగ్గుచేటని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ విమర్శించారు. 19 డివిజన్‌ లబ్బీపేట పశువుల హాస్పటల్‌ ప్రాంతంలో మంగళ వారం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అల్లూరి సీతారా మరాజు విగ్రహావిష్కరణకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీని ముఖ్యమంత్రి ప్రత్యేక హోదాపై నిలదీస్తారని, విశాఖ ఉక్కు పైవేటీకరణ చేయవద్దని అడుగుతారని రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూశారని అయితే మోదీ విమానం ఎక్కే సమయం లో ఏదో ఒక కాగితం ఇచ్చి ప్రత్యేక హోదాపై మోదీకి వినతిపత్రం ఇచ్చామని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. కేంద్రం మెడలు వంచుతామన్న జగన్‌ ప్రధాని వద్ద మోకరి ల్లడం సిగ్గుచేటన్నారు. జగన్‌ నీచమైన సంస్కృతి నిన్న జరిగిన అల్లూరి సీతారామ రాజు జయంతిలో బయట పడిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఆహ్వానిస్తే జగన్‌ దానిని జీర్ణించుకోలేక ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి తాను ఇష్టానుసారం వ్యవహరించడం దారుణమన్నారు. అనంతరం ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా డివిజన్‌లోని 200 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగం సాయిప్రసాద్‌, ఎస్‌.ఫిరోజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T06:54:41+05:30 IST