ధమ్మసాధన

ABN , First Publish Date - 2022-06-03T08:27:52+05:30 IST

బుద్ధుడు చెప్పిన ధర్మాన్ని సాధన చెయ్యడానికి మూడు దశలు ఉంటాయి. అవి: పరియత్తి, పటిపత్తి, పటివెథ. వీటిలో ‘పరియత్తి’ అంటే... సిద్ధాంతాన్ని వినడం ద్వారానో, చదవడం ద్వారానో తెలుసుకోవడం. సిద్ధాంత అధ్యయనమే పరియత్తి. ఇది మొదటి దశ. రెండోది...

ధమ్మసాధన

బుద్ధుడు చెప్పిన ధర్మాన్ని సాధన చెయ్యడానికి మూడు దశలు ఉంటాయి. అవి: పరియత్తి, పటిపత్తి, పటివెథ. వీటిలో ‘పరియత్తి’ అంటే... సిద్ధాంతాన్ని వినడం ద్వారానో, చదవడం ద్వారానో తెలుసుకోవడం. సిద్ధాంత అధ్యయనమే పరియత్తి. ఇది మొదటి దశ. రెండోది... పటిపత్తి. సిద్ధాంత అధ్యయనం కన్నా మరో ముందడుగు.. ఆచరణ. బుద్ధుని సిద్ధాంతాన్ని ఆచరించడం. ఆయన చెప్పిన నైతిక మార్గంలో నడుచుకోవడం. అధ్యయనం కన్నా ఆచరణ మేలైనది. ఇక మూడోది... పటివెథ. మొదటి రెండిటికన్నా అత్యుత్తమమైనది. ‘పటివెథ’ అంటే ధర్మాన్ని సాక్షాత్కరించుకోవడం. ధర్మంలోకి చొరబడిపోవడం. ధర్మంలో కలిసిపోవడం, తాదాత్మ్యం చెందడం. ఇది ధర్మంలో ఉన్నత స్థితి. ఈ స్థితిని పొందిన సాధకుడు ప్రాథమిక సంబోధిస్థితిని పొందినట్టే. దీన్నే బౌద్ధ పరిభాషలో ‘అవతంసక ప్రాథమిక బోధి’ అంటారు. ఈ ధర్మసాధనలో పరిపూర్ణులయినవారు బోధిసత్త్వులు... సంబుద్ధులు కాగలరు.

Updated Date - 2022-06-03T08:27:52+05:30 IST