ప్రభుత్వ వైద్యశాలను పరిశీలిస్తున్న ఎంపీపీ పార్వతి
కోవూరు, జనవరి 24 : పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను సోమవారం ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి, ఎంపీడీవో శ్రీహరి పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ నిరోధానికి వేస్తున్న వ్యాక్సిన్ల గురించిన సమాచారం రాబట్టారు. ఆసుపత్రి కార్యనిర్వాహణాధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు వైద్యశాలకు అవసరమైన పరికరాల గురించి వివరించారు.
-------------