Abn logo
Jan 20 2021 @ 21:36PM

రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : బీజేపీ

: బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్‌ బాజీని సన్మానిస్తున్న సూళ్లూరుపేట బీజేపీ నాయకులు

సూళ్లూరుపేట, జనవరి 20 :  ప్రజల విశ్వాసాలు,  ఽధర్మాల మీద దాడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్‌ బాజీ అన్నారు. బుధవారం సూళ్లూరుపేట బీజేపీ కార్యాలయంలో ఆయన బీజేపీ నేతలు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఓటు బ్యాంక్‌, మత రాజకీయాలకు స్వస్తి చెప్పాలంటే రాబోయే తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధివచ్చేలా చేయాలని చెప్పారు.  కార్యక్రమంలో  బైరి పార్థసారధిరెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, రాచర్ల కృష్ణమూర్తి, బూరగ మనోహర్‌, విజయమ్మ, తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement
Advertisement