Sep 25 2021 @ 12:32PM

'మహా సముద్రం' చిత్రబృందానికి ప్రభాస్ విషెస్

యువ హీరోలు శర్వానంద్‌ - సిద్ధార్థ్‌ నటించిన సినిమా 'మహా సముద్రం'. ఈ మూవీ టీంకు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ శుభాకాంక్షలు తెలిపారు. 'ఆర్.ఎక్స్.100 ఫేమ్' అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన 'మహా సముద్రం' విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ ట్రైలర్ వీక్షించిన ప్రభాస్.. 'ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉందని..తప్పకుండా సినిమా సూపర్ హిట్ అవుతుంది, హోల్ టీంకి మై బెస్ట్ విషెస్' అని ట్వీట్‌లో తెలిపారు. దీనికి చిత్ర యూనిట్ 'థాంక్యు పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్' అంటూ రిప్లై ఇచ్చారు. ఇక ఈ సినిమాలో అదితీరావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటించారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.